మరో సూపర్ హిట్ కోసం ప్లాన్ వేసిన ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్.. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా ?..

తెలుగులో అర్జున్ రెడ్డి సూపర్ హిట్ విజయం సాధించడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అనంతరం ఇదే సినిమాను బాలీవుడ్‏లో 'కబీర్ సింగ్' పేరుతో..

  • Rajitha Chanti
  • Publish Date - 7:50 am, Thu, 31 December 20
మరో సూపర్ హిట్ కోసం ప్లాన్ వేసిన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్.. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా ?..

తెలుగులో అర్జున్ రెడ్డి సూపర్ హిట్ విజయం సాధించడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అనంతరం ఇదే సినిమాను బాలీవుడ్‏లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించాడు ఈ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించారు. తర్వాత సందీప్ తెలుగులో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరో సినిమాను తీయబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజమే అన్నట్లుగా కబీర్ సింగ్ నిర్మాతలు హింట్ ఇచ్చారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన కొత్త సినిమా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‏తో చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయం కబీర్ సింగ్ నిర్మాత తన ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. న్యూఇయర్ కానుకగా జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్టర్ సందీప్ రెడ్డి మరియు హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్‏లో రాబోతున్న కొత్త సినిమా అప్ డేట్ రాబోతుందని ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని టీ.సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. ఇక క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రాబోతున్నట్లుగా టాక్.