కొనసాగుతోన్న దిల్‌రాజు హవా.. ఒకేసారి ఐదు సినిమాలను లైన్‌లో పెట్టిన స్టార్ ప్రొడ్యుసర్.

దిల్ రాజు మరో అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఏక కాలంలో ఐదు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండడం విశేషం.

కొనసాగుతోన్న దిల్‌రాజు హవా.. ఒకేసారి ఐదు సినిమాలను లైన్‌లో పెట్టిన స్టార్ ప్రొడ్యుసర్.
Follow us

|

Updated on: Dec 23, 2020 | 9:49 PM

dil raju 5 movies shooting at a time: సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు నిర్మాత దిల్‌ రాజు. సినిమా కథ ఎంపికలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడీ స్టార్ ప్రొడ్యూసర్. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా వస్తుందంటే చాలు అది మినిమం గ్యారెంటీ అనే భావన అటు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక దిల్ రాజు ఇటీవల 50వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజు ఇచ్చిన పుట్టిన రోజు పార్టీకి సినీ ప్రపంచం మొత్తం తరలి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు మరో అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఏక కాలంలో ఐదు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండడం విశేషం. వీటిలో.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న వకీల్ సాబ్, ఎఫ్3, థ్యాంక్యూ, పాగల్ తో పాటు ‘ఉషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇలా ఈ ఐదు సినిమాలు బుధవారం పలు లోకేషన్లలో ఒకేసారి షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఈ సినిమాలన్నింటినీ వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఈ లెక్కన దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి రెండు నెలకొక సినిమా రానుందన్నమాట. ఇక ఈ ఐదు చిత్రాలే కాకుండా మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట దిల్‌రాజు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..