నేరగాళ్ల కదలికలను కనిపెట్టే పోలీసులపైనే నిఘా నేత్రం.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న పోలీసు శాఖ

పోలీసు గస్తీ బృందం పనితీరును గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు సాంకేతికత వినియోగంపై దృష్టి సారించారు.

నేరగాళ్ల కదలికలను కనిపెట్టే పోలీసులపైనే నిఘా నేత్రం.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న పోలీసు శాఖ
Follow us

|

Updated on: Jan 06, 2021 | 4:58 PM

Digital Reports on Police: ప్రజా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. అధునిక ఆయుధాలతో పాటు కొత్త వాహనాలను సమకూర్చింది. సిబ్బంది సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. కాగా, పోలీసు గస్తీ బృందం పనితీరును గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు సాంకేతికత వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న విధానాన్ని రాష్ట్రమంతటికీ విస్తరింపజేయాలని భావిస్తున్నారు.

గస్తీలో భాగంగా నిత్యం రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 44 వేల ప్రదేశాలను 859 కార్లు, 1,525 ద్విచక్ర వాహనాలపై బ్లూకోట్స్‌ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రతి సెక్టార్లోనూ సంశయాత్మక ప్రాంతాల్లో గుర్తించి.. అయా పాయింట్ల వద్ద నిఘా సిబ్బంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు సిబ్బంది గస్తీని నిర్లక్ష్యం చేస్తూ.. రెండు, మూడు రోజులకోసారి సంతకాలు చేసేవారు. దీన్ని చక్కదిద్దేందుకు గతంలో అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనికి చెక్‌ పెట్టారు పోలీసులు ఉన్నతాధికారులు. ప్రతి సెక్టార్‌ పరిధిలో బీట్‌ పాయింట్లు, రౌడీషీటర్లు, పాత నేరస్థులు, సున్నిత ప్రాంతాల వంటి వివరాలను జియో ట్యాగింగ్‌ చేశారు. గస్తీ సిబ్బంది రోజూ బీట్‌ పాయింట్‌కు వెళ్లి, రౌడీషీటర్లు, పాతనేరస్థుల ఆనుపానులను గమనించి, ఆ వివరాలు నమోదు చేసేలా అధునిక టెక్నాలజీని పోలీసులు ఉన్నతాధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

బ్లూకోట్స్‌ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పడు విశ్లేషించిందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది. సిబ్బంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎన్ని గంటలకు ఎక్కడున్నారు, మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు ఎప్పుడు చేరుకున్నారు వంటి వివరాలన్నీ జీపీఎస్‌ ఆధారంగా కంప్యూటర్లో నమోదు కానున్నాయి. క్రోడీకరించిన సమాచారంతో సిబ్బంది వారీగా కంప్యూటర్‌ దానికదే నివేదిక తయారు చేస్తుంది. మర్నాడు ఉదయం 8 గంటలకల్లా ఎవరి నివేదిక వారి ఫోన్లకు వెళ్తుంది. దీని ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం పెరగడంతో పాటు పోలీసులు తిరుగుతున్నారనే భయం నేరగాళ్లకూ కలుగుతుందని, ప్రజలు కూడా భరోసాతో ఉంటారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, పోలీసు నిర్లక్ష్యం వీడి నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!