ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… 2758 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు…

Digital India Programme: డిజిటల్ ఇండియా వైపు మోదీ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారత్ నెట్‌కు రూ.6000 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి  1.3 లక్షల గ్రామ పంచాయితీలను అనుసంధానం చేసిన సర్కార్.. ఆ సంఖ్యను 2.5 లక్షలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో కూడా ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వస్తే డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని భావిస్తోంది. ఈ క్రమంలోనే […]

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... 2758 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు...
Follow us

|

Updated on: Feb 08, 2020 | 5:54 AM

Digital India Programme: డిజిటల్ ఇండియా వైపు మోదీ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారత్ నెట్‌కు రూ.6000 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి  1.3 లక్షల గ్రామ పంచాయితీలను అనుసంధానం చేసిన సర్కార్.. ఆ సంఖ్యను 2.5 లక్షలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో కూడా ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వస్తే డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కూడా భారత్ నెట్ ద్వారా వేల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఏపీలోని సుమారు 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు. రాజ్యసభలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సదుపాయాన్ని కల్పించడమే భారత్ నెట్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఇక ఏపీలో ఇప్పటి దాకా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 1722 గ్రామ పంచాయితీలలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించినట్లు సంజయ్ ధోత్రే వెల్లడించారు.

ఇందులో 1601 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు సిద్దమయ్యాయని.. మిగిలిన గ్రామాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. కాగా, మొత్తంగా కలిపి 2758 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సంజయ్ ధోత్రే పేర్కొన్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..