బిజెపిలో రాజధాని ప్రకంపనలు

రాజధాని అంశం ఏపీ బిజెపిలో చిచ్చు రాజేసింది. మూడు రాజధానుల ఏర్పాటును బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ స్వాగతించగా… మరో ఎంపీ సుజనాచౌదరి అసలు మూడు రాజధానుల ప్రతిపాదననే తప్పుపట్టారు. రాజధాని పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని సుజనా అంటుండగా.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును ప్రతీ ఒక్కరు స్వాగతించాలని పిలుపునిచ్చారు టిజి వెంకటేశ్. బిజెపిలో విభేదాలు లేవంటూనే ఇద్దరు ఎంపీలు తలొరకంగా మాట్లాడడం విశేషం. పైసలిచ్చాం.. పక్కా అడుగుతాం… ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం […]

బిజెపిలో రాజధాని ప్రకంపనలు
Follow us

|

Updated on: Dec 20, 2019 | 7:24 PM

రాజధాని అంశం ఏపీ బిజెపిలో చిచ్చు రాజేసింది. మూడు రాజధానుల ఏర్పాటును బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ స్వాగతించగా… మరో ఎంపీ సుజనాచౌదరి అసలు మూడు రాజధానుల ప్రతిపాదననే తప్పుపట్టారు. రాజధాని పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని సుజనా అంటుండగా.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును ప్రతీ ఒక్కరు స్వాగతించాలని పిలుపునిచ్చారు టిజి వెంకటేశ్. బిజెపిలో విభేదాలు లేవంటూనే ఇద్దరు ఎంపీలు తలొరకంగా మాట్లాడడం విశేషం.

పైసలిచ్చాం.. పక్కా అడుగుతాం…

ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, కచ్చితంగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని చెప్పారు సుజనా. బి.ఎన్. రావు కమిటీ నివేదికాంశాలు వెల్లడైన దరిమిలా సుజనా చౌదరి ఈ కామెంట్లు చేశారు.

ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులుండాలని బి.ఎన్.రావు కమిటీ సూచనలు చేసిన నేపథ్యంలో విశాఖ నగరమే రాష్ట్ర రాజధాని కాబోతోందని సుజనా అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాలు ఏడాదిలో మూడు, నాలుగు సార్లు జరుగుతాయని.. సెక్రెటేరియట్ కార్యకలాపాలు, సీఎం క్యాంప్ ఆఫీసు ఏడాది పొడవునా యాక్టివ్‌గా వుంటాయని.. అందుకే విశాఖ నగరమే ఇక ఏపీ రాజధాని అనుకోవాల్సి వుంటుందని సుజనా అభిప్రాయపడ్డారు.

మూడు కాకపోతే 33 రాజధానులు కట్టుకుంటామన్న ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు మతిస్థిమితం లేని వ్యక్తి మాట్లాడినట్లున్నాయని అన్నారు సుజనా చౌదరి. ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు ఊరుకోరని పెద్దిరెడ్డికి సుజనా వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల జీవితాలతో ఆడుకోవద్దని సుజనా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు అక్కడ్నించి విశాఖకు తరలాల్సిన అవసరం ఉత్పన్నమవుతుందని ఆయన అన్నారు.

హైకోర్టు ఒక్కటే కాదు.. మినీ సెక్రెటేరియట్ ఇవ్వాలి

జిఎన్ రావు కమిటీ నివేదికను ఆహ్వానిస్తున్నామన్నారు కర్నూలుకు చెందిన బిజెపి ఎంపీ టిజి వెంకటేశ్. అయితే అదనంగా కర్నూలులో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు వద్దు అనే వారంతా తమ మనసు మార్చుకోవాలని ఆయన కోరారు. జిఎన్ రావు కమిటీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం, శ్రీబాగ్ ఒప్పందం.. ఇలా అన్నీ కర్నూలుకి అనుకూలంగా చెప్తున్నందున అడ్డుకోవడం అనేది సమంజసం కాదని టిజి అంటున్నారు. సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్అనేవి రెండు కళ్ళు లాంటివి.. వాటికి సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట ఉండాలని టిజి సూచిస్తున్నారు. లేకపోతే పరిపాలనాపరమైన ఇబ్బందులు తప్పవని టిజి వెంకటేష్ అంటున్నారు.