విశాఖలో పేలిన పొలిటికల్‌ ల్యాండ్‌మైన్.. జీవీఎంసీ ఎన్నికల ముందు రేగిన రాజకీయ ప్రకంపనలు.. ఆ ఇద్దరి మధ్య బిగ్ వార్

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ 300 కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేశారన్నది మరో ఆరోపణ. ఆ భూములపై రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేశారు. అయితే - 30 కోట్లు ఇస్తే... తన భూమి మొత్తాన్ని ఇచ్చేస్తానని సవాల్‌...

విశాఖలో పేలిన పొలిటికల్‌ ల్యాండ్‌మైన్.. జీవీఎంసీ ఎన్నికల ముందు రేగిన రాజకీయ ప్రకంపనలు.. ఆ ఇద్దరి మధ్య బిగ్ వార్
Follow us

|

Updated on: Dec 22, 2020 | 9:23 PM

విశాఖలో భూ ఆక్రమణలపై జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అక్రమ కట్టడాలను తొలగించారు అధికారులు. మరోవైపు – తానెలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు.

అలాగే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ 300 కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేశారన్నది మరో ఆరోపణ. ఆ భూములపై రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేశారు. అయితే – 30 కోట్లు ఇస్తే… తన భూమి మొత్తాన్ని ఇచ్చేస్తానని సవాల్‌ చేశారు పీలా గోవింద్‌. అవి తనకు వారసత్వంగా వస్తున్న భూములని ఆయన స్పష్టం చేశారు.

ఇక రెండోరోజు విశాఖ ముడిసరిలోవలో అక్రమ కట్టడాలను జీవీఎంసీ తొలగించింది. జేసీబీలతో నిర్మాణాలను కూల్చేస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారు బాధితులు… పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

విశాఖ సెంట్రల్ జైల్ కు ఎదురుగా ఉన్న స్థలంలో పూరిపాకలు, తాటాకుపాకలు వేసుకున్నారు కొందరు. సర్వే నెంబర్ 26లోని 270 ఎకరాల్లోని 15ఎకరాల్లో చిన్నాచితకా షెడ్లు వేశారు. అది కబ్జా భూమి అని గుర్తించిన రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి వెళ్లి స్వాధీనం చేసుకుంది. ఆ పక్కన భూమిలోనూ ఆక్రమణలు ఉన్నాయని గుర్తించింది GVMC.

ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ ఘాటుగా స్పందించింది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రజాప్రతినిధులంతా కబ్జా చేశారని, ఆ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేయాలని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు. కబ్జా చేసిన భూముల్ని తిరిగి ఇచ్చేస్తారా… అరెస్ట్‌ అవుతారా? అని టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. అటు… వైఎస్ హయాం నుంచి జరిగిన ఆక్రమణలపై చర్చకు వస్తారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేత అశోక్‌బాబు. మొత్తంమీద ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత విశాఖ రాజకీయం భూముల చుట్టూనే తిరుగుతోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..