సీఎస్‌కే విజయాల్లో ధోనీదే కీలక పాత్ర..

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో ఈ టీమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో ఇప్పటివరకు దాదాపు 100 విజయాలు(60.61%) సాధించింది.

సీఎస్‌కే విజయాల్లో ధోనీదే కీలక పాత్ర..

Dhoni Is Key For CSK Success: చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో ఈ టీమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో ఇప్పటివరకు దాదాపు 100 విజయాలు(60.61%) సాధించింది. బ్యాటింగ్ విభాగంలోనే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. ఈ జట్టులో ఎక్కువగా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారన్నది వాస్తవమే అయినా.. ధోని కూల్ కెప్టెన్సీ, పక్కా ప్రణాళికలు విజయాల్లో కీలక పాత్రను పోషించాయి. ఇక ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ భారత దిగ్గజ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రావిడ్‌ ధోనిపై ప్రశంసలు కురిపించాడు.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన అన్ని మ్యాచుల్లోనూ ధోని ముఖ్య భూమిక పోషించాడు. అతని నిర్ణయాలు, స్మార్ట్ గేమ్ సహా టీంగా వారి పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుందని రాహుల్ ద్రావిడ్ కితాబిచ్చాడు. ”చెన్నై సూపర్ కింగ్స్ మంచి డేటాను సంపాదించగలిగింది. తెర ముందు ధోని.. తేరా వెనుక కోచ్ ఫ్లెమింగ్, సహాయక సిబ్బంది బోలెడంత పని చేస్తారు. ఇక ధోని అయితే సహచర ఆటగాళ్ల ప్రతిభను బాగా అర్ధం చేసుకోగలడు. డేటాను పట్టించుకోకుండా అందరికీ ఛాన్స్ ఇస్తాడు. ఎప్పటికీ ఇలానే ఉంటాడని ఆశిస్తున్నా” అని రాహుల్ ద్రావిడ్ అన్నాడు.

Also Read: ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తేదీలు, టైమింగ్స్ ఖరారు..

Published On - 2:33 pm, Mon, 3 August 20

Click on your DTH Provider to Add TV9 Telugu