ఇస్మార్ట్ శంకర్‌గా తమిళ ‘విఐపి’

ఇస్మార్ట్ శంకర్‌గా తమిళ 'విఐపి'

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రామ్, పూరిలకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గానీ తమిళ రైట్స్‌ను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందని.. రామ్ పాత్రకు హీరో ధనుష్ […]

Ravi Kiran

|

Aug 27, 2019 | 1:35 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రామ్, పూరిలకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకు గానీ తమిళ రైట్స్‌ను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందని.. రామ్ పాత్రకు హీరో ధనుష్ సరిగ్గా సరిపోతాడని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ధనుష్ ‘ఎనై నోకి పాయిమ్​ తోట’లో నటిస్తున్నాడు​. గౌతమ్​ మీనన్​ ఈ చిత్ర దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఇస్మార్ట్​ను పట్టాలెక్కించనున్నారని సమాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu