అసురన్ రివ్యూ: ధనుష్‌కు మరో జాతీయ అవార్డు ఖాయమేనా.?

విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘అసురన్’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకళం’, ‘వడ చెన్నై’ వంటి హిట్ ఫిలిమ్స్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెట్రిమారన్.. భారతీయ సినిమాల్లోనే అత్యధ్భుత దర్శకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన జాతీయ అవార్డు గ్రహిత.. తన సినిమాల్లో కమర్షియల్ […]

  • Ravi Kiran
  • Publish Date - 1:24 pm, Sat, 5 October 19
అసురన్ రివ్యూ: ధనుష్‌కు మరో జాతీయ అవార్డు ఖాయమేనా.?

విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘అసురన్’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకళం’, ‘వడ చెన్నై’ వంటి హిట్ ఫిలిమ్స్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

వెట్రిమారన్.. భారతీయ సినిమాల్లోనే అత్యధ్భుత దర్శకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన జాతీయ అవార్డు గ్రహిత.. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటుగా యదార్ధ సంఘటనలు అద్భుతంగా జొప్పిస్తారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోని పాత్రలు నిజమైనవే. ఇక ‘అసురన్’ విషయానికి వస్తే ఇదో వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రమని చెప్పొచ్చు. దీనిలో జనాలకు కావాల్సిన సామజిక సందేశాన్ని కూడా దర్శకుడు అద్భుతంగా చెప్పారు.

వెక్కై అనే ఫేమస్ నవల ఆధారంగా ‘అసురన్’ సినిమా తెరకెక్కింది. తమిళ హీరోల అంటేనే ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రెస్.. ఇక ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తుంటాడు. ఇక ‘అసురన్’లో ధనుష్ శివస్వామి అనే పాత్రలో కనిపిస్తాడు. ముఖ్యంగా గెటప్ పరంగా చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఇక ఈ చిత్రం మొదటి షో నుంచి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అన్ని చోట్లా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. అంతేకాక ధనుష్ నటనకు నేషనల్ అవార్డు ఖాయమని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు. ధనుష్ ఇందులో రెండు పాత్రలు చేశాడు. ఆయన ఆ రెండు క్యారెక్టర్స్‌లో జీవించాడని టాక్ నడుస్తోంది. నేషనల్ అవార్డు రాకపోతే.. ఆ అవార్డుకే అర్ధం ఉండదని.. ఖచ్చితంగా అవార్డ్స్ తెచ్చిపెట్టే సినిమా ఇదని ట్విట్టర్‌లో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అటు ‘సైరా’ వంటి బడా సినిమాకు పోటీగా ఈ చిత్రం విడుదల కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మలయాళ నటి మంజు వారియర్ కథానాయికగా తమిళ తెరకు పరిచయమైంది.

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ అందించిన నేపధ్య సంగీతం చిత్రానికి ఆరో ప్రాణమని చెప్పొచ్చు. అంతేకాక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచే విధంగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. పొలాలు ఉంటే లాక్కుంటారు.. డబ్బును దోచుకెళ్తారు.. అదే మన దగ్గర చదువుంటే.. అది వాళ్ళు ఎప్పటికి తీసుకెళ్లలేరని’.. ధనుష్ చెప్పే ప్రతి డైలాగ్ ఆలోచింపజేసేలా ఉందంటున్నారు. దీనితో అభిమానులు ధనుష్‌ నేషనల్ అవార్డు పెర్ఫార్మన్స్ చేశారని తప్పకుండా అవార్డు రావాలని కోరుకుంటున్నారు. మరి ధనుష్ నటనకు అవార్డు వస్తుందో లేదో చూడాలి.