దేవీ నవరాత్రులు… దుర్గాదేవిగా జగన్మాత!

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగాగరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, […]

దేవీ నవరాత్రులు... దుర్గాదేవిగా జగన్మాత!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 12:39 AM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగాగరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.

దేవతలందరి శక్తులు కలగలసిన మహోన్నతమైన శక్తిరూపం ఈ తల్లి. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాల ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో దర్శనమిస్తుంది. మనలోని అసూయ, ద్వేషం, అహంకారం వంటి శత్రువుల్నీ సంహరించి శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది. ఆయుధాలు ధరించడం… ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చెయ్యడానికి… అనుక్షణం సన్నద్ధంగా ఉండే లక్షణానికి నిదర్శనం.

దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అన్నిరకాల దుఃఖాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లోకాలన్నింటికీ తల్లి అయిన దుర్గాదేవి ఎలాగైతే తన బిడ్డలకు ఆపదలు రాకుండా కాపాడుతుందో తల్లులంతా తమ బిడ్డల్ని అదేవిధంగా కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుంది. స్త్రీ అంటే శాంతమూర్తి మాత్రమే కాదు… అవసరమైతే ఆదిపరాశక్తిగానూ విజృంభించగలదన్న శక్తిచైతన్యాన్ని నిరూపించడం… మహిళలకు ఈ స్ఫూర్తిని అందించడమే దుర్గాదేవి అవతారంలోని పరమార్థం. ఈ రోజున నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం