Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..
మరోసారి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను నుంచి రూ.5 కోట్లకు పైగా విలువైన 15.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టు బడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 5.4 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల.. తమ లగేజ్‌తో పాటు రెండు బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు.
సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీయడంతో పాటు, వారి మొబైల్ ఫోన్ చాటింగ్‌లు, కమ్యూనికేషన్‌ను అధికారులు పరిశీలించారు.దీంతో గీజర్లలో ఏదో తేడా ఉందనే అనుమానం వ్యక్తమైంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ రెండు గీజర్లను పూర్తిగా విప్పి, లోపలి భాగాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గ్లీజర్‌లో లోపల వారికి అత్యంత చాకచక్యంగా వ్యాక్యూమ్ సీల్డ్ చేసిన 145 ప్యాకెట్లు కనిపించాయి.
ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా అందులో అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ వీడ్ కనిపించింది. పట్టుబడిన గంజాయి మొత్తం15.4 కిలోగ్రాములు ఉంటుందని.. బ్లాక్ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 5.4 కోట్లు వరకు ఉండవచ్చని కస్టమ్స్ అధికారి తెలిపారు. ఇక నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న అధకారులు ఇద్దరి ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అంతర్జాతీయ గంజాయిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు.
Customs, IGI Airport Date: 07.06.2026Operation: AIU, IGI Airport, New DelhiSeizure: 15.38 Kg Hydroponic weed/Ganja
Customs Foils Major Hydroponic Weed Smuggling Attempt at IGI Airport; 15.38 Kg Narcotics Concealed Inside Geysers Seized
Based on profiling and specific… pic.twitter.com/6bqJfa1XYN
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) June 8, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
