ఈ నవ్వును ప్రపంచం మెచ్చింది…ఏథెన్స్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ విగ్రహం

ఆమె నవ్వుకు ఏథెన్స్‌ నగరం ఫిదా అయ్యింది. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన నవ్వు గల ప్రముఖుల విగ్రహాలను...

ఈ నవ్వును ప్రపంచం మెచ్చింది...ఏథెన్స్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ విగ్రహం
Follow us

|

Updated on: Dec 09, 2020 | 5:28 AM

Deepika Padukone Smile : బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపిక పదుకొణె తన నవ్వుతో ప్రపంచ ప్రజలను పడేసింది. తాజాగా ఆమె నవ్వుకు ఏథెన్స్‌ నగరం ఫిదా అయ్యింది. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

స్వచ్ఛమైన నవ్వు గల ప్రముఖుల విగ్రహాలను అందులో ప్రదర్శనకు పెట్టారు. అయితే.. బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణెకు అందులో చోటు దక్కింది. ఆమె విగ్రహాన్ని కూడా విమానాశ్రయంలోని ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని దీపిక అభిమానులు సోషల్‌ మీడియా షేర్‌ చేస్తున్నారు.

అయితే.. ఇందుకు సంబంధించి ఆమె మాత్రం ఇప్పటి వరకూ స్పందించకపోవడం లేదు. తన వివాహ రిసెప్షన్‌లో దీపిక ధరించిన నెక్లెస్‌, చీర ఆ విగ్రహంపై ఉండటం.. పైగా ఆ బొమ్మ కింది భాగంగా ‘బాలీవుడ్‌ నటి’ అని పేర్కొనడం సహా అచ్చుగుద్దినట్లుగా దీపిక పోలీకలు ఉండటంతో ఇది కచ్చితంగా దీపిక పదుకొణె విగ్రహమేనని  ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.