చనిపోయాడనుకున్నోడు తిరిగొచ్చాడు…మరి ఆ శవం మిస్టరీ ఏంటి..?

కొన్ని సార్లు మనకు విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. చనిపోయాడనుకున్న వ్యక్తి స్శశానం దగ్గరికి వెళ్లగానే లేచి కూర్చోవడం..వంటి ఘటనలు గతంలో చాలా చూశాం. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఓ రేర్ ఇన్సిడెంట్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద ఉన్న కుమారపురం పంటకాల్వలో ఓ మృతదేహం ఉందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. డెడ్‌బాడీని వెలికితీసిన పోలీసులు అది ఇటీవల కనిపించకుండా పోయిన జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన కావాడి చిన ఏసుగా గుర్తించారు. బంధువులు, కుటుంబ సభ్యులు […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:48 pm, Fri, 31 January 20
చనిపోయాడనుకున్నోడు తిరిగొచ్చాడు...మరి ఆ శవం మిస్టరీ ఏంటి..?

కొన్ని సార్లు మనకు విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. చనిపోయాడనుకున్న వ్యక్తి స్శశానం దగ్గరికి వెళ్లగానే లేచి కూర్చోవడం..వంటి ఘటనలు గతంలో చాలా చూశాం. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఓ రేర్ ఇన్సిడెంట్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద ఉన్న కుమారపురం పంటకాల్వలో ఓ మృతదేహం ఉందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. డెడ్‌బాడీని వెలికితీసిన పోలీసులు అది ఇటీవల కనిపించకుండా పోయిన జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన కావాడి చిన ఏసుగా గుర్తించారు. బంధువులు, కుటుంబ సభ్యులు అది అతని శవమే అనే నిర్దారణ చేశారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా..చిన్న ఏసు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఇంట్లో జనమంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇక్కడే పోలీసులుకు పెద్ద చిక్కొచ్చిపడింది. ఏసు తిరిగొచ్చాడు సరే.. ఆ శవం ఎవరిదో నిర్దారణ కాక తలలు పట్టుకుంటున్నారు.