అందుకే టిక్‌టాక్‌ వీడియోలు చేశానుః వార్నర్

'ఐ యామ్ ఏ క్రికెటర్ ఆల్‌సో.. టిక్‌టాకర్ ఆల్‌సో' అని అంటూ ఆస్ట్రేలియావిధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుటుంబసభ్యులతో కలిసి లాక్‌డౌన్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

అందుకే టిక్‌టాక్‌ వీడియోలు చేశానుః వార్నర్
Follow us

|

Updated on: Jun 22, 2020 | 11:28 AM

‘ఐ యామ్ ఏ క్రికెటర్ ఆల్‌సో.. టిక్‌టాకర్ ఆల్‌సో’ అని అంటూ ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుటుంబసభ్యులతో కలిసి లాక్‌డౌన్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగు, తమిళ, హిందీ పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను విపరీతంగా అలరించాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మైండ్ బ్లాక్’ పాటలకు అతడు వేసిన స్టెప్పులు వార్నర్ దంపతులకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన వార్నర్ లాక్‌డౌన్ సమయంలో తాను ఎందుకు వీడియోలు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. ”అసలే కరోనా కాలం.. ఆపై లాక్‌డౌన్.. దీనితో కొంతమంది ప్రజలు కష్టాలు చూడాల్సి వచ్చింది. అందుకే వారి ముఖాలపై చిరునవ్వును తేవడానికే ఈ ప్రయత్నం చేసినట్లుగా అతడు పేర్కొన్నాడు. ఎప్పుడైనా కూడా మనం ఒక మంచి పని చేయాలంటే.. మన ఆలోచనా పరిధిని మించి ఆలోచించాలి. ఈ విపత్కర సమయంలో ప్రజల్లో ఆనందం నింపడానికి నేను, నా కుటుంబసభ్యులు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఆ వీడియోలు చేశాం అని వార్నర్ తెలిపాడు.