టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఝలక్.. పార్టీ వీడిన మరో ఎమ్మెల్యే..!

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సైతం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం మరవకముందే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పామర్రు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణబాబు పార్టీకి […]

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఝలక్.. పార్టీ వీడిన మరో ఎమ్మెల్యే..!
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 7:47 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సైతం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం మరవకముందే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పామర్రు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణబాబు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పొట్లూరి కృష్ణబాబు తన భార్యతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న పురంధీశ్వరి బాలకృష్ణకు సమీప బంధువును టీడీపీ నుంచి లాగేసి పెద్ద ఝలక్ ఇచ్చారు. ఇకపోతే బాలకృష్ణ, పురంధీశ్వరిలకు దగ్గరి బంధువులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు పురంధీశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణను కూడా పార్టీని వీడకుండా బాలయ్య ఆపలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.