Cyberabad Police: ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు.. ఏం చేసారంటే..

కరోనా మహమ్మారి దేశాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే వేలమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Cyberabad Police: ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు.. ఏం చేసారంటే..
Mahesh Babu
Follow us

|

Updated on: May 11, 2021 | 3:40 PM

Cyberabad Police:

కరోనా మహమ్మారి దేశాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే వేలమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా ను కట్టడి చేయడానికి మాస్కులు, శానిటైజర్లు వాడాలని వైద్యులు తెలుపుతున్నారు.

అయితే ప్రజల్లో అవగన కలిపించేందుకు సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా తారల ఫొటోలతో ట్రోల్స్ ను క్రియేట్ చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ట్రోల్స్ చేసిన పోలీసులు.. ఇప్పుడు కరోనా పై ప్రజలకు అవగాహనా కలిపించడానికి సినిమా తరాల ఫోటోలను ఉపయోగిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఫొటోతో ఓ మెసేజ్ ను ఇచ్చారు పోలీసులు. మహేష్ బాబు స్టైలిష్ ఫోటోను జత చేస్తూ డెనిమ్ పైన డెనిమ్ వేయడం ఫ్యాషన్ ట్రెండ్ .. మాస్క్ పైన మాస్క్ వేసుకోవడం సేఫ్టీ ట్రెండ్ అని రాసుకొచ్చారు పోలీసులు. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు అభిమానులు ఈ ట్వీట్ పై రకరకాలు గా స్పందిస్తున్నారు. తప్పకుండా పాటిస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

NTR and Mahesh: తారక్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలన్న సూపర్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్..

పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..

Post-COVID Weakness: పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారా?.. హీరోయిన్ సమీరారెడ్డి చెప్పిన అద్భుతమైన చిట్కాలు మీకోసం..