ట్రూకాలర్ వినియోగదారులకు భారీ షాక్.. అది కూడా ఇండియన్స్‌కే..!

ట్రూకాలర్.. ఈ యాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు దాదాపు వినియోగిస్తుంటారు. దీని ద్వారా.. తెలియన నంబర్ నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌  కస్టమర్‌ పేరు తెలుస్తుందన్న ఉద్దేశంతో దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్‌పై గతం నుంచే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వినియోగదారుడి ఎస్‌మ్మెస్‌ రీడింగ్ అవుతుండటంతో.. గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇలా జరిగితే.. బ్యాంకింగ్‌కు సంబంధించిన ఓటీపీలు వచ్చే సమయంలో.. ఇబ్బందులు తలెత్తే అవకాశం […]

  • Updated On - 11:58 am, Wed, 27 May 20 Edited By:
ట్రూకాలర్ వినియోగదారులకు భారీ షాక్.. అది కూడా ఇండియన్స్‌కే..!

ట్రూకాలర్.. ఈ యాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు దాదాపు వినియోగిస్తుంటారు. దీని ద్వారా.. తెలియన నంబర్ నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌  కస్టమర్‌ పేరు తెలుస్తుందన్న ఉద్దేశంతో దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్‌పై గతం నుంచే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వినియోగదారుడి ఎస్‌మ్మెస్‌ రీడింగ్ అవుతుండటంతో.. గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇలా జరిగితే.. బ్యాంకింగ్‌కు సంబంధించిన ఓటీపీలు వచ్చే సమయంలో.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రూమర్‌
రావడంతో.. పెద్ద ఎత్తున వినియోదారులు దీనిని డిలీట్ చేశారు. తాజాగా.. ఈ ట్రూకాలర్‌పై మరో ఆరోపణలు వచ్చాయి.

దాదాపు 4.75 కోట్ల మంది ఇండియన్స్‌కు సంబంధించిన ట్రూకాలర్‌ డాటా వివరాలను.. ఓ సైబర్‌ నేరగాడు రూ.75 వేలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు ఓ సంస్థ గుర్తించింది. ట్రూకాలర్‌ డాటాకు సంబంధించిన వివరాల్లో.. వినియోగదారుడి మొబైల్‌ నంబర్‌తో పాటుగా.. స్త్రీ, పురుషుడు, అడ్రస్‌, కస్టమర్ వినియోగించే మొబైల్ నెట్‌వర్క్‌, సోషల్ మీడియా ఐడీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని సైబిల్ అనే ఆన్‌లైన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ప్రకటించింది. ఇదిలావుంటే.. ట్రూకాలర్‌కు సంబంధించిన అధికారులు మాత్రం.. తమ అధికారిక డేటా అది కాదని.. తమ డేటాబేస్‌ చాలా సేఫ్‌గా ఉందని తెలిపారు. అయితే ట్రూకాలర్‌ యాప్‌పై ఇప్పటికే చాలాసార్లు డేటాలీక్‌ అయ్యిందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.