రైనా రికార్డును బ్రేక్ చేసిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.  ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో సురేశ్ రైనా రికార్డును అధిగమించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ధోనీకి 194వది. సురేశ్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 193 మ్యాచులు ఆడాడు.. అందరికంటే ముందు వరసలో ఉన్నాడు. అయితే 192 మ్యాచ్‌లతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ధోనీ […]

  • Sanjay Kasula
  • Publish Date - 9:59 pm, Fri, 2 October 20
రైనా రికార్డును బ్రేక్ చేసిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.  ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో సురేశ్ రైనా రికార్డును అధిగమించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ధోనీకి 194వది.

సురేశ్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 193 మ్యాచులు ఆడాడు.. అందరికంటే ముందు వరసలో ఉన్నాడు. అయితే 192 మ్యాచ్‌లతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ధోనీ తన రికార్డును బద్దలుగొట్టడంపై రైనా సంతోషం వ్యక్తం చేశాడు. ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. తన రికార్డు ధోనీ చేతిలో బద్దలు కావడం సంతోషంగా ఉందని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కంగ్రాట్స్‌ మహీ బాయ్.. అంటూ ట్వీట్ చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విజయం సాధించాలని ఆకాంక్షించాడు.