చరితారెడ్డి డెడ్‌బాడీ తీసుకొచ్చేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌

తాను మరణిస్తూ అవయవదానం ద్వారా 9 మంది జీవితాల్లో వెలుగులు నింపింది చరితారెడ్డి. ఆమె కిడ్నీలు, లివర్‌, కళ్లు  దానం చేసినట్లు యూఎస్ వైద్యులు ప్రకటంచారు. ఈ శుక్రవారం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైంది. ప్రస్తుతం ఆమె డెడ్‌బాడీని హైదరాబాద్ తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మృతదేహాన్ని తరలించడం ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో చరితారెడ్డి స్నేహితులు క్రౌడ్ ఫడింగ్ ప్రారంభించారు. ఫేస్‌బుక్ ద్వారా ఆర్థిక […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:44 pm, Thu, 2 January 20
చరితారెడ్డి డెడ్‌బాడీ తీసుకొచ్చేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌

తాను మరణిస్తూ అవయవదానం ద్వారా 9 మంది జీవితాల్లో వెలుగులు నింపింది చరితారెడ్డి. ఆమె కిడ్నీలు, లివర్‌, కళ్లు  దానం చేసినట్లు యూఎస్ వైద్యులు ప్రకటంచారు. ఈ శుక్రవారం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైంది. ప్రస్తుతం ఆమె డెడ్‌బాడీని హైదరాబాద్ తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మృతదేహాన్ని తరలించడం ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో చరితారెడ్డి స్నేహితులు క్రౌడ్ ఫడింగ్ ప్రారంభించారు. ఫేస్‌బుక్ ద్వారా ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరారు. బుధవారం సాయంకాలానికి కావాల్సిన అమౌంట్ సరికూరాయాని ఆమె మిత్రులు తెలిపారు. కాగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం ఈ ఆదివారానికి చరితారెడ్డి డెడెబాడీ హైదరాబాద్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.