ఏపీలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం : డీజీపీ సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో 6 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 2019 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో..మీడియా సమావేశం నిర్వహించిన సవాంగ్ పలు విషయాలు తెలిపారు. పోలీసు ప్రవర్తనలో చాలా మర్పు వచ్చిందన్న డీజీపీ..రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక దిశ చట్టాన్ని తీసుకురావడంతో పాటు జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న జూదం, పేకాట వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని […]

ఏపీలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం : డీజీపీ సవాంగ్
Follow us

|

Updated on: Dec 29, 2019 | 1:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో 6 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 2019 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో..మీడియా సమావేశం నిర్వహించిన సవాంగ్ పలు విషయాలు తెలిపారు. పోలీసు ప్రవర్తనలో చాలా మర్పు వచ్చిందన్న డీజీపీ..రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక దిశ చట్టాన్ని తీసుకురావడంతో పాటు జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న జూదం, పేకాట వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని తెలిపారు.

జాతీయస్థాయిలో ఏపీ పోలీసులకు గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. పలు నేషనల్ అవార్డ్స్ పొందడంతో పాటు.. స్కోచ్‌, డీఎస్‌సీఐ జీ ఫైల్స్‌కు సంబంధించిన అంశాల్లో ప్రధాని మోదీ సైతం ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. పోలీసు కుటుంబాల సంక్షేమం గురించి కూడా అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్స్ ప్రభుత్వం కేటాయించడం అభినందనీయమన్నారు. అలాగే ఆపరేషన్ ముస్కార్‌లో వేలాదిమంది చిన్నారులను ఏపీ పోలీస్ శాఖ కాపాడిందని డీజీపీ సవాంగ్ తెలిపారు.