Suicide: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రాణాలు తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌… ఉరేసుకొని ఆత్మహ్యత చేసుకున్న పటాన్‌చెరు వాసి..

Cricket Betting Kill Software Employee: అతనో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌, ఇన్ఫోసిస్‌ లాంటి బడా ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. రూ. వేలల్లో జీతం కానీ.. క్రికెట్‌ బెట్టింగ్‌ ఆయన ప్రాణాన్ని బలికొంది. చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు..

Suicide: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రాణాలు తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌... ఉరేసుకొని ఆత్మహ్యత చేసుకున్న పటాన్‌చెరు వాసి..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 7:55 AM

Cricket Betting Kill Software Employee: అతనో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌, ఇన్ఫోసిస్‌ లాంటి బడా ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. రూ. వేలల్లో జీతం కానీ.. క్రికెట్‌ బెట్టింగ్‌ ఆయన ప్రాణాన్ని బలిగొంది. చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వివరల్లోకి వెళితే.. పటాన్‌చెరులోని చైతన్యనగర్‌ కాలనీకి చెందిన రవికుమార్‌ (28) బెంగళూరు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పటాన్‌చెరులోని ఇంట్లోనే ఉంటూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రవికుమార్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటయ్యాడు. బెట్టింగ్‌ల కారణంలో తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. తండ్రి ప్రభాకర్‌ రూ. లక్ష అప్పు తీర్చినా.. అప్పులు పూర్తిగా తీరలేవు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి మంగళవారం ఇంట్లో ఉరేసుకొని మరణించాడు. తండ్రి విధులకు వెళ్లగానే బెడ్‌ రూమ్‌లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన రవి తల్లి పక్కింటి వారికి తెలియజేయగా.. అందరూ కలిసి రవిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే రవి మరణించాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతుకొచ్చిన కుమారుడు విగత జీవిగా మారడంతో రవి తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది.

Also Read: Nizamabad Fire Accident: నిజమాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీలో మంటలు.. ఒకరు సజీవదహనం..