Vaccine Dry Run : తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. టీకా ప్రారంభానికి ముందు ఏవైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించడం..

Vaccine Dry Run : తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
Follow us

|

Updated on: Jan 05, 2021 | 12:30 AM

Vaccine Dry Run : తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. టీకా ప్రారంభానికి ముందు ఏవైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించడం, కొవి‌న్‌ పోర్టల్‌ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రై రన్‌లో భాగంగా హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎంపిక చేసిన ఏడు చోట అధికారులు డ్రై రన్‌ నిర్వహించారు.

హైదరాబాద్‌లో గాంధీ దవాఖాన, తిలక్‌ నగర్‌ పీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా దవాఖాన, సోమాజిగూడ యశోద దవాఖానతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర దవాఖాన, జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్‌లోని నేహా సన్‌షైన్‌ దవాఖానల్లో డ్రై రన్‌ చేపట్టి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించారు.

నామమాత్రపు కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియనే డ్రై రన్‌గా వ్యవహరిస్తున్నారు. టీకా పంపిణీ శిక్షణ తీసుకున్న అధికార యంత్రాంగం లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తారు.

ఇవి కూడా చదవండి..

Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న తారల అరెస్ట్‌ పర్వం..ముంబైలో పట్టుబడిన కన్నడ నటి శ్వేతా కుమారి