COVID Vaccine: 80 శాతం వ్యాక్సిన్లు ఆ దేశాల్లోనే..ఇంకా చాలా దేశాల్లో ప్రారంభం కాని వ్యాక్సినేషన్..డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

COVID Vaccine: కరోనా పై యుద్ధానికి బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తేనే కరోనా ను పారదోలే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా టీకా కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.

COVID Vaccine: 80 శాతం వ్యాక్సిన్లు ఆ దేశాల్లోనే..ఇంకా చాలా దేశాల్లో ప్రారంభం కాని వ్యాక్సినేషన్..డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
Covid Vaccine
Follow us

|

Updated on: May 11, 2021 | 10:47 PM

COVID Vaccine: కరోనా పై యుద్ధానికి బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తేనే కరోనా ను పారదోలే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా టీకా కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచమంతా కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చినా.. అన్నిదేశాలకూ సమానంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ అసమానత వల్ల పేద దేశాలు తీవ ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని అంటోంది. మొదటి నుంచీ ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ ఇదే చెబుతోంది. ధనిక ఆదాయ దేశాలు కరోన వ్యాక్సిన్ అందించడంలో ముందు వరుసలో ఉన్నాయనీ.. పేద దేశాలకు టీకా అందడం మరింత ఆలస్యం అయ్యేలా ఉందనీ చెబుతూ వస్తోంది. దీనిపై గతంలో ఆందోళన వ్యక్తం చేసింది కూడా.

డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ప్రపంచంలో 53శాతం జనాభా ధనిక, ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు. కానీ, ఆయా దేశాల కరోనా వ్యాక్సిన్‌ వాటా మాత్రం 83శాతం. కానీ, 47శాతం జనాభా ఉన్న అల్ప ఆదాయ దేశాలు మాత్రం కేవలం 17శాతం వ్యాక్సిన్‌ వాటాను కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ వెల్లడించారు. అన్నిదేశాలకూ వ్యాక్సిన్ అందేలా ధనిక దేశాలు ప్రయత్నించాలని ఆయన కోరారు.

కరోనా వ్యాక్సిన్‌(COVID Vaccine) పంపిణీలో అధిక ఆదాయ దేశాలు ముందున్న నేపథ్యంలో ఆఫ్రికా వంటి ఖండంలో ఇంకా వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు డజనుకు పైగా దేశాల్లో ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. వీటిని అధిగమించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘కొవాక్స్‌’ ద్వారా వ్యాక్సిన్‌ అందించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నందున చాలా దేశాలకు సరిపడా వ్యాక్సిన్‌ అందడం లేదు. ముందస్తుగా ఆర్డరు చేసుకోవడంతోనే ధనిక దేశాలు వ్యాక్సిన్‌ సమీకరణలో ముందున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచంలోనే వ్యాక్సిన్‌ కేంద్రంగా ఉన్న భారత్‌లోనే టీకా కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డబ్ల్యూహెచ్‌వో ధనిక దేశాలను పేద దేశాల గురించి కూడా ఆలోచించాలని కోరుతోంది. ధనిక దేశాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో మరోమారు చెప్పింది.

Also Read: Vaccination: మహిళకు ఒకేసారి ఆరుడోసుల కరోనా వ్యాక్సిన్.. ఆరోగ్యకార్యకర్త పొరపాటుతో ఘటన..ఎలా జరిగింది అంటే..

Vaccination: అమెరికాలో 12-15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు టీకా ఇవ్వడానికి రంగం సిద్ధం

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.