ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

ఉత్తర్​ప్రదేశ్​లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కరోనా బాధిత మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
Follow us

|

Updated on: Sep 25, 2020 | 11:41 AM

ఉత్తర్​ప్రదేశ్​లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కరోనా బాధిత మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని గోరఖ్​పుర్​ బీఆర్​డీ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నవజాత శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగో చిన్నారిని వెంటిలేటర్​పై ఉంచినట్లు వివరించారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే… నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు డాక్టర్లు తెలిపారు. నలుగురు చిన్నారులు 980 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, చాలా సవాలుతో కూడుకున్న డెలివరీ అని బీఆర్​డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. నలుగురు పిల్లల నుంచి కూడా శాంపిల్స్ సేకరించి, కరోనా టెస్టుల కోసం మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ కు పంపినట్టు వివరించారు.

“దేవరియా జిల్లాలోని గౌరీ బజార్​లో నివసిస్తున్న 26 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి మెడికల్ కాలేజీలోని ట్రామా సెంటర్​కు చేరుకుని కరోనా టెస్టులు చేయించుకుంది. ఈ పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అత్యంత సమర్థమైన వైద్యులు, పారామెడికల్​ టీమ్ వైద్యం అందించగా.. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ” అని ​బీఆర్​డీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గణేశ్​ కుమార్ పేర్కొన్నారు​.

Also Read :

హేమంత్ పరువు హత్య కేసులో 12 మంది అరెస్ట్..

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్