Telangana: పాముకాటుకు నాటుకోడితో చికిత్స..ఇదో వినూత్న వైద్యం.. ఈ పద్దతి కరెక్ట్ కాదంటున్న వైద్యులు

పాము కాటుకు నాటు కోడితో వైద్యం..మీరు వింటున్నది నిజమేనండోయ్.. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రామీణ నాటు వైద్యం ఇది.. ఇప్పటి వరకు ఈ వైద్యం తీసుకున్న వారు అందరూ బతికి బట్టకట్టారు.

Telangana: పాముకాటుకు నాటుకోడితో చికిత్స..ఇదో వినూత్న వైద్యం.. ఈ పద్దతి కరెక్ట్ కాదంటున్న వైద్యులు
Snake
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 18, 2022 | 6:45 PM

పాము కాటుకు నాటు కోడితో వైద్యం..మీరు వింటున్నది నిజమేనండోయ్.. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రామీణ నాటు వైద్యం ఇది.. ఇప్పటి వరకు ఈ వైద్యం తీసుకున్న వారు అందరూ బతికారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు వినూత్న రీతిలో తక్కువ ఖర్చుతో పాము కాటు వైద్యం అందిస్తున్నాడు. పాము కాటుతో ప్రాణాపాయ స్థితిలో వెళ్తే.. బయటపడేస్తానని చెబుతున్నాడు. ఈ వినూత్నమైన వైద్యం ఇప్పుడు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రజల్ని ఆకర్షిస్తోంది. అయితే, నాటుకోడితో పాముకు వైద్యం ఎలా చేస్తారన్నది తెలియాలంటే మాత్రం…ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళ్లాల్సిందే..

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లి ఓ చిన్న పల్లెటూరు. చుట్టుపక్కల వారికీ ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే అక్కడ అచ్చయ్య అనే నాటు వైద్యుడు పాముకాటుకి నాటుకోడి వైద్యం చేస్తున్నాడు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పాము కాటుకి నాటు కోడితో వైద్యం చేస్తున్నారు. వైద్యం వికటించిన దాఖలాలు ఇంతవరకు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ ఊరి ప్రజలే కాదు చుట్టుపక్కల పది గ్రామాల వారు కూడా నాటుకోడి వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారు. పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుందట. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగి పోయినట్లు లెక్క. ఇలా పాము కరిచిన వ్యక్తికి 10నుంచి 30 కోళ్ల వరకు చనిపోతూ ఉంటాయి. పాము కరిచిన వ్యక్తి ఆరోజు ఎటువంటి ఆహారం తీసుకోకుండా రాత్రి పూట నిద్రపోకుండా మెలకువగా ఉండాలి. మరుసటిరోజు మధ్యాహ్నం భోజనం చేయాలి ఇది నిబంధన. కొన్ని సందర్భాల్లో జిల్లేడు లేదా ఆకు పసరు ముక్కులోవేస్తారు దీంతో తుమ్ములు వచ్చి శరీరంలో రక్త ప్రసరణ జరిగి తొందరగా తగ్గుతుందట.

ఈ వైద్యం 30 సంవత్సరాల క్రితం గ్రామంలోని ఓ పాస్టర్ “అముక్తమాల్య”అనే గ్రంథంలో చూసి నేర్చుకోని గ్రామంలో వైద్యం చేయడం ప్రారంభించాడని, కోడి వైద్యంతో ఎవరు చనిపోక పోవడంతో గ్రామస్తులకు నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు. అప్పటినుండి ఇక్కడ ప్రజలు నాటుకోడి వైద్యం చేయించుకుంటున్నారు. ఆ పాస్టర్ గ్రామంలోని ప్రేమానందం అనే వ్యక్తికి ఈ వైద్యం నేర్పించాడు. ఇప్పుడు ఆయన కొడుకు అచ్చయ్య ఈ వైద్యం చేస్తున్నాడు. చికిత్స ఉచితంగా అందించడంతో.. స్థానికులు పాము కరిస్తే అతని వద్దకు వెళ్తున్నారు. అయితే ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదని.. వైద్య నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు నాటు వైద్యం చేయించుకుని.. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. పాము కాటుకు గురైతే.. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(ఇలాంటి పద్దుతులు అక్కడ పాటిస్తున్నారు కానీ పాము కరిచిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం ముఖ్యం.. ఇలాంటి సంప్రదాయ వైద్య చికిత్సను ఫాలో అయితే కొన్నిసార్లు ప్రాణాలకు ముప్పు రావొచ్చు. టీవీ9 కూడా ఇలాంటి నాటు వైద్యాన్ని సమర్థించదు)

నారాయణ, టీవీ9 తెలుగు, ఖమ్మం జిల్లా 

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!