చంచల్‌గూడ జైలుకు అవినీతి అధికారి లావణ్య

ఆదాయానికి మించి అక్రమాస్తులు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో లావణ్య ఇంట్లో లభ్యమైన నగదును చూసి షాక్ తిన్నారు. ఈ తనికీల్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమె బంధువుల బ్యాంక్ ఎక్కౌంట్లలో కూడా భారీగా నగదు […]

చంచల్‌గూడ జైలుకు అవినీతి అధికారి లావణ్య
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2019 | 12:52 AM

ఆదాయానికి మించి అక్రమాస్తులు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో లావణ్య ఇంట్లో లభ్యమైన నగదును చూసి షాక్ తిన్నారు. ఈ తనికీల్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమె బంధువుల బ్యాంక్ ఎక్కౌంట్లలో కూడా భారీగా నగదు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. లావణ్య ఇంటినుంచి నగలు, నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ తహశీల్దారుగా అవార్డు పొందిన లావణ్యపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని రుజువులతో సహా నిరూపించే క్రమంలో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తనికీల్లో పెద్ద ఎత్తున నగదు లభించడంతో అమెను అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్య‌ను రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారం ముగియంతో…వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లావణ్య, అనంతయ్యను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.