ఫైనల్ ఫేజ్‌కు చైనా వ్యాక్సిన్‌..!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ తాము రూపొందించిన క‌రోనా టీకాకు సంబంధించిన‌ ఇమ్యూన్ రెస్పాన్స్ ట్ర‌య‌ల్‌కు మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని పేర్కొంది. దీనితోపాటు టీకా మూడ‌వ దశలోకి

  • Tv9 Telugu
  • Publish Date - 1:46 pm, Mon, 17 August 20
ఫైనల్ ఫేజ్‌కు చైనా వ్యాక్సిన్‌..!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ తాము రూపొందించిన క‌రోనా టీకాకు సంబంధించిన‌ ఇమ్యూన్ రెస్పాన్స్ ట్ర‌య‌ల్‌కు మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని పేర్కొంది. దీనితోపాటు టీకా మూడ‌వ దశలోకి ప్రవేశించింద‌ని తెలిపింది. క‌రోనా టీకా రేసులో బ్రిటన్, అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయి. సినోఫార్మ్ పరిశోధకులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వ్యాక్సిన్‌కు సంబంధించిన మొద‌టి, మ‌ధ్య ద‌శ‌ల ట్ర‌య‌ల్స్‌లో టీకా అందించే భద్రత, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసే ఆధారాలు కొనుగొన్నారు.

చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ యూనిట్ అయిన సినోఫార్మ్ యుఎఇలో టీకాను పరీక్షిస్తోంది. సినోఫార్మ్ టీకా రెగ్యులేటరీ ఆమోదం కోసం అధునాతన రీతిలో పరీక్షించాల్సివుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని సినోఫార్మ్ చైర్మన్ మీడియాకు తెలిపారు. ఈ టీకా మూడవ దశ ట్రయల్ కేవలం మూడు నెలల్లో పూర్తవుతుంద‌న్నారు. సినోఫార్మ్ పరిశోధకులు ఈ టీకాకు సంబంధించిన వివ‌రాల‌ను జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) లో ప్రచురించారు. కాగా ఈ టీకా పాకిస్తాన్‌కు కూడా సరఫరా చేయనున్నారు. ఇందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయ‌ని స‌మాచారం.

Read More:

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!