ఏపీ సర్కార్ రికార్డ్…లక్ష దాటిన కోవిడ్-19 టెస్టులు

ఏపీ సర్కార్ రికార్డ్...లక్ష దాటిన కోవిడ్-19 టెస్టులు

కోవిడ్ 19 పరీక్షలు టెస్టులు చేయ‌డంలో ఇప్ప‌టికే దేశంలో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న ఆంధ్ర‌ప‌దేశ్ మ‌రో ఘ‌న‌త సొంతం చేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద‌ ఇప్పటి వరకు లక్షకు పైగా కోవిడ్-19 టెస్టుల‌ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. రికార్డు స్థాయిలో 1,02,460 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 7,902 శాంపిల్స్‌ను టెస్టు చెయ్య‌గా.. 60 మందికి కోవిడ్-19 సోకిన‌ట్లు శుక్రవారం ఉదయం ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం […]

Ram Naramaneni

|

May 01, 2020 | 1:25 PM

కోవిడ్ 19 పరీక్షలు టెస్టులు చేయ‌డంలో ఇప్ప‌టికే దేశంలో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న ఆంధ్ర‌ప‌దేశ్ మ‌రో ఘ‌న‌త సొంతం చేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద‌ ఇప్పటి వరకు లక్షకు పైగా కోవిడ్-19 టెస్టుల‌ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. రికార్డు స్థాయిలో 1,02,460 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు పేర్కొంది.

ఇక గడిచిన 24 గంటల్లో 7,902 శాంపిల్స్‌ను టెస్టు చెయ్య‌గా.. 60 మందికి కోవిడ్-19 సోకిన‌ట్లు శుక్రవారం ఉదయం ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,463 కు చేరుకుంది. తాజాగా, 82 మంది కోలుకుని హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 403కు చేరుకుందని వెల్ల‌డించింది.

కాగా ఈ మ‌హ‌మ్మారి వైరస్‌ బారినపడి గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో క‌రోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 33కు చేరుకుందని పేర్కొంది. ప్రస్తుతం ఏపీలో 1,027 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu