తూర్పుగోదావరిలో కరోనా కలకలం..?

CoronaVirus Outbreak: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఊహించని విధంగా ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి బారినపడి 500 మంది మృతి చెందగా.. సుమారు 20 వేల మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మన దేశంలో ఈ కరోనా వైరస్ బాధితుల సంఖ్య ముగ్గురికి చేరిన సంగతి విదితమే. అంతేకాక పలువురు ఆ లక్షణాలతో ఆసుపత్రిల్లో చేరి చికిత్స కూడా పొందుతున్నారు. మరోవైపు […]

తూర్పుగోదావరిలో కరోనా కలకలం..?

CoronaVirus Outbreak: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఊహించని విధంగా ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి బారినపడి 500 మంది మృతి చెందగా.. సుమారు 20 వేల మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మన దేశంలో ఈ కరోనా వైరస్ బాధితుల సంఖ్య ముగ్గురికి చేరిన సంగతి విదితమే. అంతేకాక పలువురు ఆ లక్షణాలతో ఆసుపత్రిల్లో చేరి చికిత్స కూడా పొందుతున్నారు. మరోవైపు ఈ వ్యాధి సోకిన వృద్ధులు, పిల్లల పరిస్థితి నరకం అని చెప్పాలి. అటు కేంద్రం పలు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌కు సంబంధించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు గాంధీ ఆసుపత్రిలో వైరల్ ల్యాబ్‌ను కూడా కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కానప్పటికీ.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇటీవల చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అతడు తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతుండగా.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతన్ని వెంటనే పరిశీలనలో పెట్టారు. అంతేకాక ఆయన నుంచి రక్త నమూనాలను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు.

Published On - 2:18 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu