షాకింగ్: ఇరాన్‌లో 250మందికి పైగా భారతీయులకు కరోనా..!

ఇరాన్‌లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

షాకింగ్: ఇరాన్‌లో 250మందికి పైగా భారతీయులకు కరోనా..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 18, 2020 | 8:40 AM

ఇరాన్‌లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 724 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది.

దేశవ్యాప్తంగా 72 ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆప్ఘనిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియాల నుంచి భారత్‌కు ప్రయాణీకుల రాకను పూర్తిగా నిషేధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఐరోపా దేశాలు, టర్కీ, బ్రిటన్‌ ప్రయాణికులపై కూడా భారత్‌ ఇప్పటికే నిషేధం విధించింది. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ వరకు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వాలు మూసేయించిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా భయం.. వృద్ధ దంపతుల గెంటివేత..!