భారత్‌లో 81కి చేరిన కరోనా కేసులు.. కేరళలో 900మంది అనుమానితులు..!

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. తాజాగా శుక్రవారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిద్ బాధితుల సంఖ్య 80కి చేరుకుంది.

  • Tv9 Telugu
  • Publish Date - 5:09 pm, Fri, 13 March 20
భారత్‌లో 81కి చేరిన కరోనా కేసులు.. కేరళలో 900మంది అనుమానితులు..!

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. తాజాగా శుక్రవారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిద్ బాధితుల సంఖ్య 80కి చేరుకుంది. మనేసర్‌లోని క్యారంటైన్ కేంద్రంలో ఉన్న ఇటలీ నుంచి వచ్చిన భారతీయుడికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని ప్రభావం భారత్‌లోనూ బలంగానే ఉంది.

అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిద్ ను మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోనూ ఈ అంటువ్యాధి వేగంగా ప్రబలుతోంది. మార్చి తొలివారంలో భారత్‌లో ఒకే రోజు రెండు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయినా పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది.

కాగా.. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా, లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో కోవిడ్ కేసులు 11కి చేరడంతో మార్చి 22 వరకు కాలేజీలు, స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేరళలోని పత్తినంథిట్ట జిల్లాల్లో దాదాపు 900 మంది కరోనా అనుమానితులను స్వీయ నిర్బంధంలో ఉంచారు.

ఈ రోజు అర్ధరాత్రి 12 నుండి ముంబై, నవీ ముంబై, పూణే, నాగ్పూర్, పింప్రి చిన్చ్వాడ్ వద్ద జిమ్, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ సెంటర్లు, మాల్స్ మూసివేయబడతాయని మహారాష్ట్ర సీఎం ప్రకటించారు.

[svt-event date=”13/03/2020,5:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]