బెల్జియంలో కరోనా సునామీ హెచ్చరిక

కరోనా వైరస్‌ను ఎంత కట్టడి చేద్దామనుకుంటున్నా కుదరడం లేదు.. ఆ వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తున్నదే కానీ తగ్గడం లేదు.. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడుతున్నాయి.. ముఖ్యంగా యూరప్‌ దేశాలైతే చిగురుటాకులా వణికిపోతున్నాయి..

బెల్జియంలో కరోనా సునామీ హెచ్చరిక
Follow us

|

Updated on: Oct 20, 2020 | 8:46 AM

కరోనా వైరస్‌ను ఎంత కట్టడి చేద్దామనుకుంటున్నా కుదరడం లేదు.. ఆ వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తున్నదే కానీ తగ్గడం లేదు.. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడుతున్నాయి.. ముఖ్యంగా యూరప్‌ దేశాలైతే చిగురుటాకులా వణికిపోతున్నాయి.. ఇప్పుడు అక్కడ సెకండ్‌వేవ్‌ ప్రారంభమయ్యిందట! ఇప్పటికే బ్రిటన్‌ కోవిడ్‌-19 నిబంధనలను చాలా కఠినంగా అమలుచేస్తున్నది.. కొన్ని ప్రాంతాలలో భార్యాభర్తలైనా సరే భౌతికదూరం పాటించాల్సిందేనంటూ నిబంధన పెట్టింది.. ఇక బెల్జియంలోనూ కరోనా తీవ్రంగా ఉంది.. కరోనా కేసులు సునామీలా వెల్లువెత్తే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు.. ముందుజాగ్రత్తగా బార్లు, రెస్టారెంట్లు నెల రోజుల పాటు మూసేసింది బెల్జియం ప్రభుత్వం.. అలాగే రాత్రిళ్లు కర్ఫ్యూ విధించింది..గత కొన్ని రోజులుగా బెల్జియంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి.. హాస్పిటల్స్‌లో కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే టేకప్‌ చేస్తున్నారు.. అన్ని హాస్పిటల్స్‌లో కోవిడ్‌-19 పేషంట్లే ఉంటున్నారు. మనం కరోనా సునామీకి చాలా దగ్గరలో ఉన్నామని బెల్జియం ఆరోగ్యశాఖ మంత్రి ఫ్రాంక్‌ వాండెన్‌ బ్రౌకే ప్రకటించడంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. రోజుకు అక్కడ కనీసం ఎనిమిది వేల కేసులు నమోదవుతున్నాయి.. వారం రోజుల్లో కేసుల సంఖ్య 79 శాతం పెరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. బెల్జియం జనాభా కోటికి పైగా ఉంటే.. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి. పదివేల మందికి పైగా మరణించారు.