చైనాలో మరణ మృదంగం.. ఒక్క రోజే 88 మంది మృతి

Corona-virus Effect: ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా వైరస్‌.. వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో దీని బారిన పడి నిన్న ఒక్క రోజే 88 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 811 మంది మరణించగా.. ప్రపంచ వ్యాప్తంగా 37,155 కేసులు నమోదు కాగా, 6,109 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తాజాగా డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకూ 28 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. గతంలో సార్స్‌ బారిన పడి చైనా, హాంకాంగ్ మృతిచెందిన వారి సంఖ్య […]

చైనాలో మరణ మృదంగం.. ఒక్క రోజే 88 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 09, 2020 | 8:09 AM

Corona-virus Effect: ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా వైరస్‌.. వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో దీని బారిన పడి నిన్న ఒక్క రోజే 88 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 811 మంది మరణించగా.. ప్రపంచ వ్యాప్తంగా 37,155 కేసులు నమోదు కాగా, 6,109 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తాజాగా డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకూ 28 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది.

గతంలో సార్స్‌ బారిన పడి చైనా, హాంకాంగ్ మృతిచెందిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ కావడం భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హుబెయ్‌ ప్రావిన్సు, రాజధాని వుహాన్‌ ఇంకా అష్టదిగ్బంధంలోనే ఉన్నాయి. కరోనా బారిన పడితే బ్రతుకుతామో లేదో అనే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్‌కు దేశాలన్ని భయపడుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు.