Corona Vaccine Budget 2021 Live Updates: కరోనా వైరస్ వ్యాక్సిన్ కి రూ. 35 వేల కోట్లు, 64, 180 కోట్లతో ఆత్మ నిర్భర్ స్వస్త్ భారత్

Budget 2021COrona Vaccine: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బుడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 2021-22  సంవత్సరానికి కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 35,400 కోట్లు

  • Umakanth Rao
  • Publish Date - 12:01 pm, Mon, 1 February 21
Corona Vaccine Budget 2021 Live Updates: కరోనా వైరస్ వ్యాక్సిన్ కి రూ. 35 వేల  కోట్లు, 64, 180 కోట్లతో ఆత్మ నిర్భర్ స్వస్త్ భారత్

Budget 2021: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బుడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 2021-22  సంవత్సరానికి కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 35,400 కోట్లు కేటాయించినట్టు ఆమె తెలిపారు. అవసరమైతే ఈ నిధులను మరింత పెంచుతామన్నారు. సంకల్ప్ ఆత్మ నిర్భర్ భారత్ అంటూ పదేపదే ప్రస్తావించారు. హెల్త్- వెల్ బీయింగ్-డెవలప్ మెంట్, హ్యూమన్ కేపిటల్ ఇన్నోవేషన్ అన్న ఆరు అంశాలకు తాము అధిక ప్రాధాన్యమిచ్చినట్టు చెప్పారు. ఆరోగ్య రంగానికి 2.33 లక్షల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ‘హెల్త్-వెల్ బీయింగ్ కేటాయింపులు 138 శాతం పెంచుతామని, 2,23,846 కోట్లను కేటాయిస్తున్నామని సభ్యుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అర్బన్ స్వచ్ఛ భారత్  మిషన్ 2.0 అమలు చేస్తాం..ఇందుకు రూ. 1.41 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద లక్ష్యాల సాధనకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది అని నిర్మలా సీతారామన్ వెల్లడించేజారు. ఉత్పాదకరంగం డబుల్ డిజిట్ సాధించాల్సి ఉందని, ఈ రంగానికి నిధులను పెంచుతామని అన్నారు.

Also Read:

Budget in Telugu 2021 LIVE: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్