ప్రతి ఇంటిలో కరోనా పరీక్షలు… డేర్ డెసిషన్ తీసుకున్న సీఎం

కరోనాకు ముకుతాడు వేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో డోర్‌ టు డోర్‌ సర్వే ఒకటి. ప్రతి కుటుంబాన్ని పరీక్షించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రాష్ట్రాలు ప్రతీ ఇంటిలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో...

  • Rajesh Sharma
  • Publish Date - 6:28 pm, Sun, 19 April 20
img

కరోనాకు ముకుతాడు వేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో డోర్‌ టు డోర్‌ సర్వే ఒకటి. ప్రతి కుటుంబాన్ని పరీక్షించడం. ఇది బిల్వారాలో సక్సెసయ్యింది. హర్యానా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలందరికీ టెస్ట్‌లు చేస్తానంటోంది. అయితే అనేక కారణాల వల్ల ఈ పద్దతి అనేక చోట్ల సక్సెస్‌ కావడం లేదు. ఈ గ్యాప్‌లను పూడ్చడానికి ఆరోగ్య సేతు యాప్‌ పనికి వస్తుందంటున్నారు.

కరోనా వైరస్‌కు కళ్లెం వేయాలంటే ప్రజలందరికీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా? ఆ లెక్కన దేశమంతటా చేయాలంటే 130 కోట్ల మందిని పరీక్షించాలంటే సాధ్యమవుతుందా? హర్యానా ప్రభుత్వం తమ రాష్ట్రంలో డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. ఆ మేరకు ప్లాన్‌ చేస్తోంది. కొన్ని సిటీలు, పట్టణాలలో ఇటువంటి సర్వేలు చేపట్టాయి. ఒక రాష్ట్రం ఈ తరహా ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి.

2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో 2 కోట్ల 30 లక్షల మంది ఉన్నారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌ చేయడం, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే డోర్‌ టు డోర్‌ సర్వే లక్ష్యం. రాజస్తాన్‌లోని భిల్వారాలో ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. అక్కడ మొత్తం జనాభా సుమారు 30 లక్షలు.. సిటీలోని అన్ని ఇళ్లు తిరిగి అందరినీ పరీక్షించారు. అనుమానం ఉన్న ఇళ్లల్లో ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేశారు. ఇలా చండీగఢ్‌లోనూ, తమిళనాడులోని తిరుచ్చిలోనూ , పూణెలోని కొన్ని ప్రాంతాలలో, ముంబాయిలోని ధారావిలో, కేరళలోని పత్తనమిట్టలో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. డోర్‌ టు డోర్‌ సర్వే అన్ని చోట్ల సక్సెస్‌ అవుతుందని చెప్పలేం.