ఇండియాలోని ఆ రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడిన నిరసనలు..!

ఇండియాలోని ఆ రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడిన నిరసనలు..!

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాల‌కూ విస్త‌రించింది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ కు 18 లక్షల మందికిపైగా సోక‌గా లక్షమందికిపైగా మృతి చెందారు. భారత్ లోనూ ఈ వైర‌స్ వ్యాప్తి క్ర‌మ‌క్ర‌మంగా పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా 9 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే మ‌న దేశంలోని 3 రాష్ట్రాలకు మాత్రం ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ వ్యాప్తి చెంద‌లేదు. మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నాగాలాండ్​లో ఈరోజే తొలి […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 13, 2020 | 4:31 PM

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాల‌కూ విస్త‌రించింది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ కు 18 లక్షల మందికిపైగా సోక‌గా లక్షమందికిపైగా మృతి చెందారు. భారత్ లోనూ ఈ వైర‌స్ వ్యాప్తి క్ర‌మ‌క్ర‌మంగా పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా 9 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే మ‌న దేశంలోని 3 రాష్ట్రాలకు మాత్రం ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ వ్యాప్తి చెంద‌లేదు. మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నాగాలాండ్​లో ఈరోజే తొలి కేసు వెలుగు చూసింది. ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. అందునా టూరిస్ట్ ప్లేసులు కావటం విశేషం. ఇవే కాదు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయి.

కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండడానికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలే కారణమని కొన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2019 డిసెంబర్ 11న కేంద్ర‌ప్ర‌భుత్వం అమల్లోకి వచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఎత్తున ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. సీఏబీకి పార్లమెంటులో చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉండ‌గానే నిర‌స‌న‌లు జోరందుకున్నాయి. బిల్లు చట్టంగా మార‌డంతో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా మంది టూరిస్టులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.

దీంతో ఈశాన్య రాష్ట్రాలకు.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌కులు, ఫారెన్ టూరిస్టులు రాక‌పోవ‌డంతో ఈ స్టేట్స్ లో క‌రోనా అంత‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని అంచ‌నా. ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 36 కేసులు నమోదయ్యాయి. అందులో 30 కేసులు తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు లింకులు ఉన్న‌వే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu