Corona Effect: ఈ ఏడాదీ తాజ్ వద్ద రంజాన్ ప్రార్ధనలు జరగలేదు..373 ఏళ్లలో ఇది రెండోసారి మాత్రమే!

Corona Effect: కరోనా రెండో వేవ్ దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తీసుకువచ్చింది. దీంతో ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ కళ తప్పింది.

  • Publish Date - 7:32 am, Sun, 16 May 21
Corona Effect: ఈ ఏడాదీ తాజ్ వద్ద రంజాన్ ప్రార్ధనలు జరగలేదు..373 ఏళ్లలో ఇది రెండోసారి మాత్రమే!
Tajmahal

Corona Effect: కరోనా రెండో వేవ్ దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తీసుకువచ్చింది. దీంతో ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ కళ తప్పింది. సామూహిక ప్రార్ధనలకు అవకాశం లేకపోవడంతో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకున్నారు. వరుసగా రెండో సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా రంజాన్ పండుగ సందర్భంగా పలు ముఖ్యమైన మసీదులు తలుపులు తెరుచుకోలేదు. ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్ మహల్ దగ్గరకు కూడా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగ్రా నగరం నలుమూలల నుంచి వచ్చే ముస్లిం సోదరులు ప్రార్ధనలకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. వరుసగా రెండో సంవత్సరం కూడా ఇలా ఈద్-ఉల్-ఫితర్ సమయంలో తాజ్ వద్ద ప్రార్ధనలు చేసుకోలేకపోవడం వారిని నిరాశ పరిచింది.
ఇలా తాజ్ మహల్ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మూసి వేసి ఉండడం 373 సంవత్సరాలలో ఇది రెండోసారి మాత్రమే అని తాజ్ గంజ్ నివాసులు చెబుతున్నారు.

ఈద్ సందర్భంగా తాజ్ లోకి ప్రవేశం ఉచితంగా ఉంటుంది. ఈ పండుగ కొసం ఆగ్రా నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రార్ధనలు నిర్వహించడానికి వస్తారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇక్కడ ఈద్ ప్రార్ధనలు ఆగిపోయాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా తాజ్ గంజ్ పరిసర ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి.

పర్యాటకులు అలాగే, స్థానిక నివాసితుల కోసం తాజ్ మహల్ గత సంవత్సరం 188 రోజులు మూసివేశారు. గత సెప్టెంబరులో తిరిగి అందరికోసం ప్రారంభించారు. ఇప్పుడు, రెండవ వేవ్ కారణంగా ఏప్రిల్ 16 నుండి మళ్ళీ తాజ్ మహల్ దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు. తదుపరి నోటీసు వచ్చేవరకు తాజ్ మహల్, ఆగ్రా లోని ఇతర ఎఎస్ఐ-రక్షిత స్మారక చిహ్నాలు మూసివేసి ఉంటాయని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) వర్గాలు తెలిపాయి. స్మారక చిహ్నం ఎప్పుడు తిరిగి తెరుస్తుందో చెప్పలేమని ఆ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Tauktae Cyclone: కేర‌ళ‌ను అత‌లాకుత‌లం చేస్తోన్న తౌతే తుపాను.. ‘రెడ్ అలెర్ట్’ ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ శాఖ‌..

LPG Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు అలర్ట్‌: సీలు చూసి మోసపోవద్దు.. ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే నష్టపోయినట్లే..!