రామలింగారెడ్డి ఆశయాలకు అనుగుణంగా దుబ్బాక అభివృద్ధిః సుజాత

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సోలిపేట్ రామలింగారెడ్డి సతీమణి సుజాత ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.

రామలింగారెడ్డి ఆశయాలకు అనుగుణంగా దుబ్బాక అభివృద్ధిః సుజాత
Follow us

|

Updated on: Oct 22, 2020 | 4:50 PM

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సోలిపేట్ రామలింగారెడ్డి సతీమణి సుజాత ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని సోలిపేట సుజాత అన్నారు. గురువారం చేగుంట మండలం వల్లభపూర్, తాండ, నర్సంపల్లి, చిట్టోజిపల్లి, పొలంపల్లి, పోతన్ శెట్టి పల్లి గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చాను. దుబ్బాకను రామలింగారెడ్డి అభివృద్ధి చేశాడు. నాకు మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకరన్నల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు. కాగా, సోలిపేట సుజాతకు గ్రామ, గ్రామాన కార్యకర్తు ఘన స్వాగతం పలికారు. అయా గ్రామస్తులు బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.