లేఖపై సంతకాలు పెట్టారు, రెండుగా చీలిపోయారు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి, వీరిలో కొందరు పార్టీ మీద 'ఫైట్' కొనసాగిద్దామంటే.. మరికొందరు ఇక ఇక్కడితో వదిలేద్దాం బాబూ అంటూ 'నీరసపడి పోయారట'...

  • Umakanth Rao
  • Publish Date - 3:56 pm, Thu, 3 September 20
లేఖపై సంతకాలు పెట్టారు, రెండుగా చీలిపోయారు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి, వీరిలో కొందరు పార్టీ మీద ‘ఫైట్’ కొనసాగిద్దామంటే.. మరికొందరు ఇక ఇక్కడితో వదిలేద్దాం బాబూ అంటూ ‘నీరసపడి పోయారట’…మొదట ఈ వారాంతంలో అంతా మీట్ అయి, ‘భవిష్యత్ కార్యాచరణ’ గురించి చర్చిద్దామనుకుని కూడబలుక్కున్నా…చివరిక్షణంలో కొందరు ‘మేం రామ్’ అనేశారని తెలిసింది. మన లేఖలో ప్రస్తావించిన డిమాండ్లలో ఏదీ నెరవేరలేదని, ఇక ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగిద్దామని జితేంద్ర ప్రసాద, అఖిలేష్ ప్రసాద్ సింగ్ వంటి వాళ్ళు అంటే, కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు మాత్రం సీన్ తిరగబడిందే అని ఉసూరుమన్నట్టు సమాచారం. పెద్ద సీనియర్లయిన గులాం నబీ ఆజాద్, శశి థరూర్ కూడా ఎవరికి  వారు ‘విడిపోయారు. సీ డబ్ల్యు సీ సమావేశం ముగిసింది గనుక ఇక అంతా కామ్ అయిపోదామని శశి థరూర్ వ్యాఖ్యానించగా, ఎన్నికల ద్వారా పూర్తి స్థాయి నాయకత్వం అవసరమన్న తన డిమాండును వదులుకునేందుకు గులాం నబీ ఆజాద్ సిధ్దపడలేదు.

ఇప్పుడు ఇంతకీ వీళ్ళు సాధించిందేమిటో ఎవరికీ అర్థం కాలేదు. అసమ్మతివాదులుగా ముద్ర పడడం తప్ప అని విశ్లేషకులు అంటున్నారు. సోనియా నాయకత్వానికి మాత్రం ఢోకా లేనట్టే !