రాహుల్‌కు సిబల్, ఆజాద్ ఘాటు కౌంట‌ర్లు

కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త పోరు తీవ్రమైంది. సీనియ‌ర్ల‌కు, రాహుల్ గాంధీకి అస‌లు పొసగ‌డం లేద‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితులను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

రాహుల్‌కు సిబల్, ఆజాద్ ఘాటు కౌంట‌ర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 2:42 PM

కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త పోరు తీవ్రమైంది. సీనియ‌ర్ల‌కు, రాహుల్ గాంధీకి అస‌లు పొసగ‌డం లేద‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితులను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. పార్టీలో సమర్ధవంత‌మైన శాశ్వ‌త‌‌ నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు సోనియాకు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపైనే అగ్గి రాజుకుంది. బీజేపీతో కుమ్మక్కయి సోనియాకు సీనియర్లు‌ లేఖ రాశారని రాహుల్ కామెంట్ చేయ‌డంతో ప‌రిస్థితుల తీవ్ర‌త మ‌రింత పెరిగింది.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కపిల్ సిబల్ ట్విట్టర్‌లో స్పందించారు. గడిచిన 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా తాము ఏ విషయంలోనూ వ్యవహరించలేదని గుర్తు చేశారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షాన నిలిచామ‌ని, మణిపూర్‌లో బీజేపీని గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామ‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించ‌డం పట్ల క‌పిల్ సిబాల్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇదే విష‌యంపై మ‌రో సీనియ‌ర్ నేత‌ గులాంనబీ ఆజాద్ సైతం ఘాటుగా స్పందించారు. బీజేపీతో కలిసి సోనియాకు లేఖ రాసామని నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కాగా సీనియర్ల లేఖపై సీడ‌బ్ల్యూసీ భేటీలో కూడా చ‌ర్చ జరుగుతోంది. పార్టీ అంతర్గత అంశమైన లేఖ బయటకు లీక్ అవడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. పైగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖ రాయడంపై కూడా అసహనం వ్య‌క్తి చేసిన‌ట్లు తెలుస్తోంది.

Also Read :

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??