టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ది చెబుతారు: రాములమ్మ

టీఆర్ఎస్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి చేస్తున్న ఆమరణ దీక్ష పై యావత్ తెలంగాణ చర్చించుకుంటుందని చెప్పారు. సీఎల్పీ విలీనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రతిపక్ష హోదాను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్ష కొత్త చర్చకు దారితీసిందన్నారు. ఎప్పటికి తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో టీఆర్ఎస్ వరుస తప్పులు […]

  • Anil kumar poka
  • Publish Date - 12:11 pm, Mon, 10 June 19
టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ది చెబుతారు: రాములమ్మ

టీఆర్ఎస్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి చేస్తున్న ఆమరణ దీక్ష పై యావత్ తెలంగాణ చర్చించుకుంటుందని చెప్పారు. సీఎల్పీ విలీనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రతిపక్ష హోదాను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్ష కొత్త చర్చకు దారితీసిందన్నారు. ఎప్పటికి తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో టీఆర్ఎస్ వరుస తప్పులు చేస్తోందని విజయశాంతి విమర్శించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే టీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారన్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయని.. వైసీపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు సంబుర పడ్డారని.. అనంతరం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఘోర పరాజయం పాలయ్యారని తెలిపారు. తెలంగాణలోనూ అటువంటి పరిస్థితి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.