రానున్న బడ్జెట్ పై కాంగ్రెస్ పెదవి విరుపు, ‘మెరుపులు’ ఉండవన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

2021-22 సంవత్సరానికి  కేంద్రం పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్ లో 'మెరుపులు' ఏమీ ఉండవని కాంగ్రెస్ సీనియర్ నేత..,

రానున్న బడ్జెట్ పై కాంగ్రెస్ పెదవి విరుపు, 'మెరుపులు'  ఉండవన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 28, 2021 | 6:09 PM

2021-22 సంవత్సరానికి  కేంద్రం పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్ లో ‘మెరుపులు’ ఏమీ ఉండవని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. 2021 సంవత్సరం నెగెటివ్ గ్రోత్ తో ముగుస్తుందన్నారు. కొత్త ఆర్ధిక సంవత్సరంలో అంచనాలు వేసిన దేనినీ ప్రభుత్వం సాధించజాలదని ఆయన చెప్పారు. ఎక్కువ మార్జిన్ తో రెవెన్యూ లక్ష్యాలను ప్రభుత్వం మిస్ అవుతుందని, కేపిటల్ పెట్టుబడి దెబ్బ తింటుందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు దాదాపు 5 శాతం ఉంటుందని, ఆర్థిక  లోటు 7 శాతం మించుతుందని ఆయన చెప్పారు. దేశం ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది.. రికవరీ రేటు చాలా స్లో గా ఉంటుంది.. రూరల్ ఇండియాలో 9.2 శాతం, అర్బన్ ఇండియాలో 8.9 శాతం నిరుద్యోగ రేటు ఇలాగే కొనసాగుతుంది అని చిదంబరం పేర్కొన్నారు.  దేశంలో ఎన్నో ఉద్యోగాలను కోల్పోయామని, అవి మళ్ళీ తిరిగి వస్తాయన్న ఆశ లేదన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలతో మోదీ ప్రభుత్వం ఈ రంగాన్ని కునారిల్లజేసిందని, కానీ ఇప్పటికైనా నిరంకుశ విధానాలను విడనాడి సరైన చర్యలు  తీసుకున్న పక్షంలో వ్యవసాయ రంగం కొంతవరకైనా మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. దేశంలో బలహీన, బడుగు కుటుంబాలకు కనీసం 6 నెలల పాటు 20 నుంచి 30 శాతం నేరుగా నగదు బదలాయింపు పథకాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుధ్దరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. వీటికోసం రెవెన్యూ ప్లాన్ ని అమలు చేయాలని, కొత్త జాబ్స్ సృష్టించాలని, టాక్స్ రేట్లను, ముఖ్యంగా జీఎస్టీని, పరోక్ష పన్నులను తగ్గించాలని చిదంబరం కోరారు. Read More:తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..! Read More:టీఆర్ఎస్ పొత్తుపై తేల్చి చెప్పిన ఎంఐఎం అధినేత… చాలా చోట్ల కారుతోనే ఫైట్ అంటున్న ఒవైసీ.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..