‘ అవినీతి క్లబ్ లో మరో పెద్దమనిషి ‘ .. చిద్దూకు బెయిలుపై బీజేపీ

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన ఉదంతంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ‘ అవినీతిపరుల ప్రతిష్టాత్మక క్లబ్ ‘ లో మరో వ్యక్తి చేరారని ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. ఇది ‘ క్లాసిక్ కేస్ ఆఫ్ సెలబ్రేటింగ్ కరప్షన్ ‘ (అవినీతి సంబరాల భలే కేసు) అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ […]

' అవినీతి క్లబ్ లో మరో పెద్దమనిషి ' .. చిద్దూకు బెయిలుపై బీజేపీ
Follow us

|

Updated on: Dec 04, 2019 | 4:46 PM

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన ఉదంతంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ‘ అవినీతిపరుల ప్రతిష్టాత్మక క్లబ్ ‘ లో మరో వ్యక్తి చేరారని ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. ఇది ‘ క్లాసిక్ కేస్ ఆఫ్ సెలబ్రేటింగ్ కరప్షన్ ‘ (అవినీతి సంబరాల భలే కేసు) అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా,, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రాబర్ట్ వాధ్రా, మోతీలాల్ వోరా, భూపేందర్ హుడా, శశిథరూర్ వంటి వారెందరో వివిధ కేసుల్లో చిక్కుకుని బెయిలుపై బయటకి వఛ్చిన వారే అని ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా.. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసు మెరిట్ల పై ఢిల్లీ హైకోర్టు ‘ ఏకపక్షంగా ‘ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ‘ ట్రిపుల్ టెస్ట్ ఫౌండ్ ‘ అని పేర్కొంది. అంటే కోర్టు వ్యాఖ్యలు చిదంబరానికి అనుకూలంగా ఉన్నట్టు అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆయన ఎక్కడికీ (బయట దేశాలకు) వెళ్లేవారు కారని, సాక్ష్యాధారాలను తారుమారు చేసేవారు కారని, దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నారని.. ఇలా ఆ కోర్టు ఉత్తర్వుల్లో ‘ లక్షణాలు ‘ కనబడ్డాయని సుప్రీంకోర్టు తెలిపింది.