కరోనా లాక్ డౌన్: లక్షల మందికి ఆహారం అందిస్తున్న.. ‘కమ్యూనిటీ కిచెన్’..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. దీంతో నిరుపేదలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల కమ్యూనిటీ కిచెన్

కరోనా లాక్ డౌన్: లక్షల మందికి ఆహారం అందిస్తున్న.. 'కమ్యూనిటీ కిచెన్'..
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 5:12 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. దీంతో నిరుపేదలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల కమ్యూనిటీ కిచెన్ లక్షలాది మందికి ఆహారాన్ని అందిస్తోంది. ఉత్తర ప్రదేశ్ బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ ప్రారంభించిన ఈ కమ్యూనిటీ కిచెన్  ఇప్పటివరకు మూడున్నర లక్షల మంది ఆకలిని తీర్చింది.

కాగా.. పరిషత్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శైలజా కాంత్ మిశ్రా ఆదివారం మాట్లాడుతూ మధుర జిల్లాలో ఇప్పటివరకు 3,64,000 ఫుడ్ ప్యాకెట్లను కమ్యూనిటీ కిచెన్ నుండి పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కమ్యూనిటీ కిచెన్‌లో పనులు జరుగుతుంటాయని చెప్పారు. ఈ సమయంలో సామాజిక దూరం ఖచ్చితంగా పాటిస్తారన్నారు. ఈ  కమ్యూనిటీ కిచెన్ కోసం రాష్ట్ర క్యాబినెట్ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి ఇటీవల ఒక ట్రక్కు  గోధుమలను పంపారని ఆయన తెలిపారు.