రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. కల్నల్, మేజర్​ సహా ఐదుగురు మృతి

రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు..  కల్నల్, మేజర్​ సహా ఐదుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో మరోసారి టెర్ర‌రిస్టులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్​లో హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. వీరమరణం పొందిన‌వారిలో కల్నల్​, మేజర్​ కూడా ఉన్నారు. ఛాంజ్​ముల్లాలో ముష్క‌రులు.. పౌరుల్ని బందీలుగా ఉంచారాన్న ఇన్ప‌ర్మేష‌న్ తో రక్షించేందుకు వెళ్లింది సైనిక బృందం. ఈ విష‌యాన్ని పసిగట్టి తెగ‌బ‌డిన‌ ఉగ్రమూక‌..భద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పులు జరిపింది. వెంట‌నే అల‌ర్ట‌యిన భారత సైన్యం.. ఇద్దరు ఉగ్ర‌వాదుల్ని హతమార్చింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో భార‌త ఆర్మీ […]

Ram Naramaneni

|

May 03, 2020 | 9:31 AM

జమ్ముకశ్మీర్​లో మరోసారి టెర్ర‌రిస్టులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్​లో హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. వీరమరణం పొందిన‌వారిలో కల్నల్​, మేజర్​ కూడా ఉన్నారు.

ఛాంజ్​ముల్లాలో ముష్క‌రులు.. పౌరుల్ని బందీలుగా ఉంచారాన్న ఇన్ప‌ర్మేష‌న్ తో రక్షించేందుకు వెళ్లింది సైనిక బృందం. ఈ విష‌యాన్ని పసిగట్టి తెగ‌బ‌డిన‌ ఉగ్రమూక‌..భద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పులు జరిపింది. వెంట‌నే అల‌ర్ట‌యిన భారత సైన్యం.. ఇద్దరు ఉగ్ర‌వాదుల్ని హతమార్చింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో భార‌త ఆర్మీ కల్నల్​, మేజర్​ సహా మొత్తం ఐదుగురు అమరులయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu