కాఫీ డే సీఈవోగా వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక.. భర్త ఆశయాన్ని నిలబెట్టే ప్రయత్నం

కొత్తగా సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మాళవిక హెగ్డే మళ్లీ కాఫీ డేకు పూర్వ వైభవం తీసుకొస్తారనే ఆశాభావం ఆ సంస్థ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తన భర్త ఆశయాన్ని నిలబెట్టే ప్రయత్నం ఆమె చేస్తున్నారని సమాచారం.

కాఫీ డే సీఈవోగా వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక.. భర్త ఆశయాన్ని నిలబెట్టే ప్రయత్నం
Follow us

|

Updated on: Dec 08, 2020 | 1:01 PM

Coffee Days New CEO: కెఫే కాఫీ డే కంపెనీ సీఈవోగా వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే బాధ్యతలు స్వీకరించారు. గతేడాది కాఫీ డే వ్యవస్థాప కుడు సిద్ధార్థ మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ప్రాణాలు తీసుకున్నారు. ఆయన భార్య మాళవిక కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కూతురు. బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డేకు దేశమంతటా వందలాది కాఫీ షాపులున్నాయి. కెఫే కాఫీ డే ఆలోచనే ఒక వినూత్నం. మనదేశంలో వృద్ధి చెందుతున్న మనీడ్‌ క్లాస్‌ జనాల కోసం కాపుచీనో, లాట్స్‌ని అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థ.

ఒకప్పుడు స్టార్‌బక్స్ కార్ప్, బారిస్టా, కోకాకోలా కో యాజమాన్యంలోని కోస్టా కాఫీ వంటి వాటితో పోటీపడిన సంస్థ సిద్ధార్థ మరణంతో మళ్లీ వెనక్కి వెళ్లి పోయింది. ఆయన మరణం తర్వాత కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు మొత్తం క్రాష్ అయ్యాయి. చివరికి ఫిబ్రవరి 3 నుంచి వాటి ట్రేడింగ్‌ నిలిపివేశారు. ఇక కొత్తగా సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మాళవిక హెగ్డే మళ్లీ కాఫీ డేకు పూర్వ వైభవం తీసుకొస్తారనే ఆశాభావం ఆ సంస్థ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తన భర్త ఆశయాన్ని నిలబెట్టే ప్రయత్నం ఆమె చేస్తున్నారని సమాచారం.