పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేల కోలాహలం, చూసి తరించి గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటారంటోన్న ప్రజా ప్రతినిధులు

నిన్నటి వరకూ ఓపికపట్టి పశ్చిమగోదావరి జిల్లా పందేల రాయుళ్లు భోగి పండుగనాడు ఓపెనైపోయారు. పోలీసుల హెచ్చరికలు సైతం బేఖాతరు చేసి..

  • Venkata Narayana
  • Publish Date - 5:55 pm, Wed, 13 January 21
పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేల కోలాహలం, చూసి తరించి గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటారంటోన్న ప్రజా ప్రతినిధులు

నిన్నటి వరకూ ఓపికపట్టిన పశ్చిమగోదావరి జిల్లా పందేల రాయుళ్లు భోగి పండుగనాడు ఓపెనైపోయారు. పోలీసుల హెచ్చరికలు సైతం బేఖాతరు చేసి హై రేంజ్ లో బరులు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో స్థానిక ఎమ్మెల్యే రామరాజు దగ్గరుండి పందాలను ప్రారంభించారు. కోడి పొట్లాటలు సంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయని…నియోజకవర్గ ప్రజలే కాకుండా… వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్లు పోటీలు చూసి తమ గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటారని రామరాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అత్తిలి, రేలంగి, వేల్పూరు, తణుకు పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలు చోట్ల కోడిపందేలు ప్రారంభించి, ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అటు, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి, కొయ్యలగూడెం మండలాల్లోను, ఉండిలో జోరుగా బరులు ఏర్పాటు చేశారు. కొత్తపేటలో కోడిపందేలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు. కోడిపందేల బందోబస్తు కోసం నిర్వాహకులు బౌన్సర్లను పెట్టుకోవడం విశేషం.