గోదావరి తీరంలో కోడి పందాల కయ్యం.. ఆడేందుకు సై సై అంటున్న పందెం రాయుళ్లు.. నై నై అంటున్న పోలీసులు

బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్లు రాకలతో పల్లెలు సందడిగా మారుతాయి. పతంగుల కోలాహలం, కోడి పందేలు జోరు ఈ పండుగకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

గోదావరి తీరంలో కోడి పందాల కయ్యం.. ఆడేందుకు సై సై అంటున్న పందెం రాయుళ్లు.. నై నై అంటున్న  పోలీసులు
Follow us

|

Updated on: Jan 12, 2021 | 7:51 AM

Sankranti Cock Fight : సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ సంబరమే వేరు. తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. హరిదాసు కీర్తనలు, బసవన్న దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, తెల్లవారుజామున జంగమదేవర జేగంటలు, ఢమరుక నాదాలు, పిట్టలదొర బడాయి మాటలూ, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. కోస్తాంధ్ర, రాయలసీమలో సంక్రాంతి పండుగను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్లు రాకలతో పల్లెలు సందడిగా మారుతాయి.

పతంగుల కోలాహలం, కోడి పందేలు జోరు ఈ పండుగకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. కానీ, ఈసారి గోదావరి జిల్లాల్లో మాత్రం సందడితో పాటు సందిగ్దత కూడా నెలకొంది. ఆట జరుగుతుందా లేదా అన్నదే అందరి నోటా వినిపించే మాట. గోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వహిస్తే ఉరుకునేంది లేందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరుపుతామంటున్న పందెంరాయుళ్లు. దీంతో ఇరు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటీ అనేది జూదం లాంటిది. కానీ అన్నిపోటీలు జూదం కాకకూడదు. అలా అవుతాయనుకున్న వాటిని అసలు పోటీనే జరగకుండా ఆపాలన్నది పోలీసులు ఆలోచన.

గోదావరి జిల్లాల్లో 90 శాతం పోటీలు జూదంగానే జరుగుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఆటలపోటీల్లో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. దీనిని కట్టడి చేయడం కోసం పోలీసు యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పందెం రాయుళ్లు మాత్రం కోడిపందాలు నిర్వహించడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. పోలీసుల కళ్లు కప్పి వీటిని నిర్వహించడానికి రహస్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు సిద్దం చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని పోలీసులు గుర్తించి ద్వంసం చేస్తున్నారు. కోడి పందేలు జరగకుండా గతంలో తామిచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. దీంతో పందెం రాయుళ్లను బెదరగొట్టడం కోసం పోలుసులు నిఘాను పెంచడంతో పాటు దాడులు ముమ్మరం చేశారు.

ఇదిలావుంటే, నిర్వాహకులను బైండవర్ కేసులతో బయపెడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా ఏటా మాదిరిగానే పందేలు నిర్వహించుకోవచ్చన్న ధీమాతో పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల బరులు సిద్దం చేస్తున్నారు. తరతరాల సాంప్రదాయంగా వస్తున్న పోటీలను అడ్డుకోవడం సరికాదంటున్నారు. అయితే సారి హైకోర్టు ఆదేశాలతో పాటు కోవిడ్ నిబంధనలు కూడా ఉండడంతో పోలీసులు మరింత దూకుడు పెంచారు.

ఇదీ చదవండి…. పండక్కి ఊరెళ్తున్నారా..ఇల్లు జాగ్రత్త..! వెళ్లే ముందు మాకు సమాచారం ఇవ్వండిః పోలీసులు

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..