ఈనెల 7న ప్రారంభంకానున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో..!

ఎట్టకేలకు రాజధానిలో మరో మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకోనుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల ఏడు(శుక్రవారం)న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం పొడవు 67 కిలోమీటర్లకు పెరగనుంది. ఐటీ శాఖా మంత్రి కె. తారక […]

ఈనెల 7న ప్రారంభంకానున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో..!

ఎట్టకేలకు రాజధానిలో మరో మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకోనుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల ఏడు(శుక్రవారం)న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు.

దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం పొడవు 67 కిలోమీటర్లకు పెరగనుంది. ఐటీ శాఖా మంత్రి కె. తారక రామారావు మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-మియాపూర్ లైన్లను నడుపుతున్న విషయం తెలిసిందే. మెట్రో రైల్ మొదటి దశలో భాగమైన నాగోల్-అమీర్‌పేట-మియాపూర్ మార్గంతో 2017 నవంబరులో ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్బీ నగర్ అమీర్‌పేట మార్గాన్ని 2018 అక్టోబరులో ప్రారంభించారు. అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. దేశంలోనే రెండవ పెద్ద మెట్రోగా హెదరాబాద్ మెట్రో గుర్తింపు పొందింది.

[svt-event date=”05/02/2020,12:33AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Click on your DTH Provider to Add TV9 Telugu