లిక్క‌ర్ షాపులు ఓపెన్ చేసే ప్ర‌సక్తే లేదు..

శనివారం సాయంత్రం నాటికి తెలంగాణ‌లో 503 కోవిడ్ వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాతో 14 మంది చనిపోయారని, 96 మంది వ్యాధి న‌య‌మై డిశ్చార్జ్‌ అయ్యారని సీఎం తెలిపారు. ఇక ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్పారు . ఇప్పటివరకు లాక్‌డౌన్ కు స‌హ‌క‌రించిన ప్రజలు ధ‌న్య‌వాదాలు తెలిపిన సీఎం..ఇదే స్ఫూర్తిని మ‌రికొన్ని రోజులు కొన‌సాగించాల‌ని కోరారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి […]

లిక్క‌ర్ షాపులు ఓపెన్ చేసే ప్ర‌సక్తే లేదు..
Follow us

|

Updated on: Apr 11, 2020 | 10:31 PM

శనివారం సాయంత్రం నాటికి తెలంగాణ‌లో 503 కోవిడ్ వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాతో 14 మంది చనిపోయారని, 96 మంది వ్యాధి న‌య‌మై డిశ్చార్జ్‌ అయ్యారని సీఎం తెలిపారు. ఇక ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్పారు . ఇప్పటివరకు లాక్‌డౌన్ కు స‌హ‌క‌రించిన ప్రజలు ధ‌న్య‌వాదాలు తెలిపిన సీఎం..ఇదే స్ఫూర్తిని మ‌రికొన్ని రోజులు కొన‌సాగించాల‌ని కోరారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 10 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఇక లిక్క‌ర్ షాపులు విష‌యంలో లాక్ డౌన్ ఏమైనా స‌డ‌లించే అవ‌కాశం ఉందా అని మీడియా ప్ర‌తినిధులు సీఎంను ప్ర‌శ్నించ‌గా, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓపెన్ చేసే అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పారు.